- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: ఫొటోగ్రాఫర్లపై రానా ఆగ్రహం.. అసలు కారణం ఇదే!
టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తనను ఫొటోలు తీసేందుకు వచ్చిన ఫోటోగ్రాఫర్లుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, సాధారణంగా కూల్ అటిట్యూడ్‌తో కనిపించే రానా ఒక్కసారిగా ఇలా ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అవ్వటంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై తాజాగా రానా స్పందించి, కార్లిటీ ఇచ్చారు.
ముంబై ఎయిర్‌పోర్టులో రానా నడుచుకుంటూ వెళ్తుండగా, ఓ ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తూ వెనుకే ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో రానాకు ఎదురుగా వస్తోన్న మహిళ ఢీకొనడంతో ఆయన ఫోన్ ఒక్కసారిగా చేయి జారి కిందపడి పోయింది. దీంతో అప్పటికే అసహనంతో ఉన్న రానా ఆగ్రహానికి గురై వెంటనే వెనక్కి వెళ్లి ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడారు. నో చెప్పినా ఇలా వెంటపడటం కరెక్ట్ కాదని వారికి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వటంతో నెటిజన్లు అక్కడ అమ్మాయిది తప్పు.. కానీ రానా ఎందుకు ఫొటోగ్రాఫర్‌పై కోపడ్డాడనే చర్చ మొదలైంది.
దీనిపై రానా స్పందిస్తూ.. తనకు ఇలాంటివి నచ్చవని చెప్పారు. ఈ పాప్ కల్చర్ టాలీవుడ్‌లో లేదని వివరించారు. హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు ఎక్కువగా తమ ఇళ్లలోనే పార్టీలు నిర్వహిస్తారని, నగరం విస్తరించి ఉండటంతో సాధారణంగా ఫొటోగ్రాఫర్లు కనిపించరని తెలిపారు.






