‘పెద్ది’ నుంచి రామ్‌బుజ్జి పోస్టర్ రిలీజ్.. మాస్ అండ్ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ యాక్టర్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-19 07:01:05  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(RAM CHARAN), బుచ్చిబాబు సనా(BUCHIBABU SANA) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’(Peddi).

‘పెద్ది’ నుంచి రామ్‌బుజ్జి పోస్టర్ రిలీజ్.. మాస్ అండ్ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్న స్టార్ యాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(RAM CHARAN), బుచ్చిబాబు సనా(BUCHIBABU SANA) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’(Peddi). దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్(Shivaraj Kumar), జగపతి బాబు(Jagapathi Babu), దివ్యేందు శర్మ(Divyendu Sharma)లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు స్టార్ యాక్టర్ దివ్యేందు శర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి అతని ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. ‘పెద్ది బృందం తమ 'రామ్‌బుజ్జి'(Rambujji) అకా అత్యున్నత ప్రతిభావంతుడైన divyenduకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నది.. 'రామ్‌బుజ్జి' అనేది పెద్ది యొక్క ముడి & గ్రామీణ ప్రపంచం నుండి అత్యంత ఆసక్తికరమైన పాత్రలలో ఒకటిగా ఉంటుంది.

ఈ సినిమా మార్చి 27, 2026న గ్లోబల్ విడుదల కానుంది’ అని రాసుకొస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్‌లో దివ్యేందు గుబురు జుట్టు, రగ్గడ్ గడ్డంతో చాలా సీరియస్‌గా కనిపిస్తున్నాడు. కుడి చేతి చూపుడు వేలుకు బ్యాండేజ్ పెట్టుకొని ఉన్నాడు. అలాగే ఎడమ చేతికి వాచ్ పెట్టుకుని మాస్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మరింత హైప్ పెంచేసింది.

Next Story