- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Gopal Varma: ప్రభాస్ ‘స్పిరిట్’లో రామ్ గోపాల్ వర్మ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ (Script work) పూర్తి కాగా.. షూటింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు డైరెక్టర్. దీంతో.. సోషల్ మీడియా(Social media)లో మాత్రం పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ (Police officer) పాత్రలో నటిస్తున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ‘స్పిరిట్’లో టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ‘శారీ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆర్‌జీవి క్లారిటీ ఇచ్చాడు.
‘మీరు కల్కి(Kalki)లో కనిపించి ఆకట్టుకున్నారు.. సినిమా అంతా ఒక ఎత్తు అయితే మీ పార్ట్ వచ్చినప్పుడు మాత్రం అరుపులు వినిపించాయి. ఇప్పుడు ‘స్పిరిట్’లో కూడా మీ రోల్ ఉంటుందని టాక్.. దీనిపై మీరు ఏం అంటారు’ అని ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ఇదైతే నిజం కాదు. ఫస్ట్ నన్ను సందీప్ అడగలేదు.. ఇక కల్కిలో కూడా పెద్ద ఆలోచించి ఏం చేయలేదు.. ఏదో సరదాగా చెయ్యమన్నారు చేసేశాను అంతే.. కానీ, జనాల ఎక్స్‌ప్రెసన్‌కు మాత్రం నేను సర్‌ప్రైజ్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు.






