రామ్ చరణ్ ‘రంగస్థలం’ కు ఏడేళ్లు పూర్తి.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా రాజమౌళి కామెంట్స్!

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘రంగస్థలం’.

రామ్ చరణ్ ‘రంగస్థలం’ కు ఏడేళ్లు పూర్తి.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా రాజమౌళి కామెంట్స్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సుకుమార్(Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘రంగస్థలం’. ఇందులో రామ్ చరణ్ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నటించింది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, వై రవిశంకర్, సి.వి మోహన్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో జగపతి బాబు(Jagapathi Babu), ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి(Aadi Pinisetty), అనసూయ వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా 2018లో విడుదలై ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.

ఇందులో రామ్ చరణ్, సమంత నటన అదుర్స్ అనేలా ఉంది. ఎంతోమంది ఈ సినిమాను ఇప్పటికీ మళ్లీ మళ్లీ చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. మళ్లీ ఈ కాంబోలో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చి 7సంవత్సరాలు పూర్తి అయినట్లు సమాచారం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకధీరుడు రాజమౌళి ‘రంగస్థలం’సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను రామ్ చరణ్ కలిసి చేసి సినిమా ‘మగధీర’. నాకు అతనికి ఇదే బిగ్గెస్ట్ చిత్రం.

కానీ నేను ‘రంగస్థలం’ మూవీ చూశాక నిజంగా షాక్ అయ్యాను. రామ్ చరణ్ ఫి నామినల్ యాక్టర్ అని అస్సలు ఊహించలేదు. ఆయన అంతలా ఎలా నటిస్తున్నాడని అనుకున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కాగా, రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ అంచనాలను పెంచేసింది. ఇక శ్రీరామ నవమి కానుకగా ‘పెద్ది’గ్లింప్స్ కూడా రాబోతున్నాయి.

Next Story