- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: ఈ సినిమా కచ్చితంగా రాసిపెట్టుకోండి.. పెద్దిపై హైప్ పెంచేస్తున్నా రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈఏడాది ‘గేమ్ చేంజర్’ (Game changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరిచాడు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈఏడాది ‘గేమ్ చేంజర్’ (Game changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఫ్యాన్స్‌ను నిరుత్సాహ పరిచాడు.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, రిలీజ్ అయిన తర్వాత కేవలం మిక్సిడ్ టాక్ సొంతం చేసుకోవడం.. అలాగే రిలీజైన మొదటి రోజు హెచ్‌డీ ప్రింట్ లీక్ కావడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నష్టాలు చూసింది. దీంతో.. రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురకావడంతో పాటు.. నెక్ట్స్ సినిమాపై వారి ఆశలను పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటిస్తు్న్న నటిస్తున్న హై వోల్టెడ్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన్’ ఫేమ్ బుచ్చిబాబు సనా (Buchibabu Sana) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ లెవల్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ మరింతగా ‘పెద్ది’పై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మేరకు ‘ఈ మాట నేను మామూలుగా అన్ని సినిమాలకు చెప్పను.. ఈ సినిమా మాత్రం కచ్చితంగా రాసిపెట్టుకోండి’ అంటూ చర్రీ చేసిన కామెంట్స్ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు.. ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సహాన్ని నింపాయి.






