- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతిలోక సుందరి కూతురికి జగదేక వీరుడి కొడుకు బర్త్ డే విషెస్
జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం(Devara Movie)తో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం(Devara Movie)తో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ సక్సెస్ అందుకున్నది. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తోన్న #RC16 చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అయితే.. ఈ రోజు జాన్వీ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేకంగా పోస్టు పెట్టారు.
దీంతో కామెంట్ బాక్సులో మెగా అభిమానులు రెచ్చిపోతున్నారు. చిరంజీవి, శ్రీదేవీ కాంబినేషన్‌లో వచ్చిన జగదేక వీరుడు.. అతిలోక సుందరి సినిమాను మించి.. రామ్ చరణ్, జాన్వీ సక్సెస్ అందుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తుండటం విశేషం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Kannada superstar Shivaraj Kumar), జగపతి బాబు, మీర్జాపూర్ సిరిస్‌తో క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ యాక్టర్ మున్నాభాయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌తో నిరాశ చెందిన రామ్ చరణ్, మెగా అభిమానులు ఈ #RC16 చిత్రం కోసం ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
Happy Birthday, #JanhviKapoor ! Excited for all that’s coming your way. Wishing you happiness and success always! pic.twitter.com/uGzmBnaBZI
— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2025






