హ్యాండీక్యాప్డ్‌గా రామ్ చరణ్.. ‘RC16’ సినిమా స్టోరీ లీక్!

by Disha Web Desk 6 |
హ్యాండీక్యాప్డ్‌గా రామ్ చరణ్.. ‘RC16’ సినిమా స్టోరీ లీక్!
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇటీవల చరణ్‌కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్ది కాలంగా షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చి ఉపాసన కూతురు క్లిన్ కారాతో సంతోషంగా గడుపుతున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత చెర్రీ ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16లో నటించనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో హీరో స్పోర్ట్స్ మ్యాన్. చిన్న గ్రామం నుంచి మొదలైన అతని ప్రస్థానం అంతర్జాతీయంగా తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ, విలన్ అడ్డుపడటంతో హీరో ఆటల్లో పాల్గొన్నప్పుడు ఓ అవయవాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ హీరో కృంగిపోకుండా.. తన ఆశయాన్ని సాధించడానికి ఒక కొత్త జట్టును ఏర్పాటు చేసి.. వారు అంతర్జాతీయ స్థాయిలో కప్‌ ఎలా సాధించారు అనేదే కథ. కాగా సినిమా మధ్యలో రామ్ చరణ్ హ్యాండీక్యాప్డ్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read..

రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తున్న‏ యంగ్ హీరోయిన్స్

Next Story

Most Viewed