upasana: ‘ప్రతి స్త్రీ విజయం మరొకరికి ప్రేరణగా ఉండాలి’.. మెగా కోడలు ఇన్స్పిరేషన్ కామెంట్స్

by Kodari Anjali |   (  Updated:2025-05-24 10:17:10  IST  )

మెగా కోడలు ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

upasana: ‘ప్రతి స్త్రీ విజయం మరొకరికి ప్రేరణగా ఉండాలి’.. మెగా కోడలు ఇన్స్పిరేషన్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా కోడలు ఉపాసన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వైస్ చెర్మన్‌గా ఉంటూ ఇటు మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. మరోపక్క ఉపాసన పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. తనవంతు సాయం చేస్తూ మెగా కోడలు గొప్ప మనసు చాటుకుంటుంది. ఇప్పటికే ఉపాసన ఎంతో మందికి సేవలు అందించిన విషయం తెలిసిందే.

ఇక ఉపాసన అండ్ టాలీవుడ్ సీనియర్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రేమించుకుని... వీరిద్దరు పెద్దల్ని ఒప్పించి గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఏడడుగుల, మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉపాసన, చరణ్.. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పిల్లలకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకున్నారు.

అలాగే వీరు పెళ్లైనా పదకొండు సంవత్సరాలకు పండండి ఆడపిల్లలకు జన్మనిచ్చారు. మెగా ప్రిన్సెస్ అపోలో హాస్పిటల్‌లో చాలా హెల్తీగా జన్మించింది. ఇకపోతే మెగా కోడలు ఉపాసన తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో ప్రేక్షకుల్ని పలకరిస్తుంటుంది. అయితే తాజాగా ఉపాసన మహిళల్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది.

‘ప్రతి స్త్రీ విజయం మరొకరికి ప్రేరణగా ఉండాలి. మనం ఒకరినొకరు ఉద్ధరించుకుని, శక్తివంతం చేసుకున్నప్పుడు మనం బలంగా ఉంటాం.@flo_hyderabad_chapter మీరు మహిళలు రాక్‌స్టార్‌లు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అండక నమ్మకంగా ఉండండి’’. ఉంటూ ఓ వీడియో పంచుకుని క్యాప్షన్ రాసుకొచ్చింది.

Next Story