- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోజులు బాగానే ఇస్తున్నారు.. రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు.. రామ్ చరణ్, బుచ్చిబాబుల లేటెస్ట్ ఫొటోలపై ట్రోల్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవలోలో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సి ఉండగా.. కేవలం ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉన్నందున సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.
జూన్‌కు ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసినట్లు ప్రకటించారు కానీ అఫీషియల్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఇద్దరు కూల్ లుక్‌లో దిగిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ‘నిజంగానే Calm Before the Storm లా ఉన్నారు.. ఈ జూన్‌లో పెద్ది గ్రాండ్ రిలీజ్ అని ప్రకటించారు కానీ డేట్ చెప్పలేదు. ఫోటోలకు మాత్రం కూల్‌గా పోజులు ఇస్తారు.. కానీ అధికారిక అప్డేట్స్ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంటారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






