ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్(వీడియో)

by Gugulothu.Kavitha |

కొద్ది రోజులుగా అల్లు(Allu), మెగా(Mega) ఫ్యామిలీల మ‌ధ్య వైరం న‌డుస్తుందంటూ అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.

ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజులుగా అల్లు(Allu), మెగా(Mega) ఫ్యామిలీల మ‌ధ్య వైరం న‌డుస్తుందంటూ అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యం నుండి రెండు కుటుంబాల మ‌ధ్య విభేదాలు బ‌హిర్గతం అవుతూనే ఉన్నాయి. బ‌న్నీ అరెస్ట్ స‌మ‌యంలో అత‌ను చిరంజీవి(Chiranjeevi) ఇంటికి వెళ్ల‌డంతో గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయేమో అని అంతా అనుకున్నారు. కాని రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజుకి బ‌న్నీ విషెస్ చెప్ప‌క‌పోవ‌డం మ‌ళ్లీ అనుమానాలు క‌లిగేలా చేసింది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో.. అల్లు అర్జున్, రామ్ చరణ్(Ram Charan) మధ్యలో సురేఖ, ఉపాసనలు కూర్చొన్నారు. అయితే బన్నీ చరణ్‌‌ను తన పక్కకి వచ్చి కూర్చోమని సైగ చేస్తాడు. దీంతో చరణ్ వచ్చి అల్లు అర్జున్(Allu Arjun) పక్కన కూర్చున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు బన్నీ కూడా గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం.

వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Next Story