- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ram Charan: నా బర్త్‌డేకి ఎక్కువగా అకీర ఇచ్చే గిఫ్ట్ అదే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstoppable).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాపబుల్’(Unstoppable). ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో కూడా విజయవంతంగా నడుస్తోంది. ఇక ఈ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఆహా(AHA)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు వచ్చిన ఈ కార్యక్రమానికి రీసెంట్‌గా రామ్ చరణ్(Ram Charan) తాను నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈషో సెకండ్ ఎపిసోడ్‌ను రిలీజ్ మేకర్స్.
ఇక అందులో చరణ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. అలాగే స్టార్ హీరో ప్రభాస్(Prabhas)కు కాల్ చేసి అతని పెళ్లి గురించి మాట్లాడారు. అయితే బాలకృష్ణ చరణ్‌ను అకీరా(Akhira Nandan) గురించి చెప్పమని అడుగగా.. దానికి రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘వాళ్ల నాన్న(పవన్ కళ్యాణ్) లాగే అకీరా నందన్ బుక్స్ ఎక్కువగా చదువుతాడు. నా పుట్టిన రోజుకు కూడా పుస్తకాలు గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. అలాగే పియానో కూడా చాలా బాగా వాయిస్తాడు. ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఇస్తాడా అని నేను కూడా ఎదురు చూస్తున్నా.. త్వరలోనే వస్తాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తండ్రి జీన్స్ ఎక్కడికి పోతాయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






