Rakul Preet Singh: మీ మనస్తత్వం ఎల్లప్పుడూ మిగతావన్నీ నిర్మించే ప్రాథమిక పునాదిగా ఉంటుంది..

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే.

Rakul Preet Singh: మీ మనస్తత్వం ఎల్లప్పుడూ మిగతావన్నీ నిర్మించే ప్రాథమిక పునాదిగా ఉంటుంది..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ భామ మంచి స్టార్ డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. అయితే అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు.. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఏమైందో ఏమో కానీ అవకాశాలు రావట్లేదు.

ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే జాకీ భగ్నాని(Jockey Bhagnany)తో ప్రేమలో పడి షికార్లు చేసింది. ఇక గతేడాది అతనితో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం తన భర్తతో ఎంజాయ్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా రకుల్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఓ కోట్‌ని పోస్ట్ చేసింది. ‘మీ మనస్తత్వం ఎల్లప్పుడూ మిగతావన్నీ నిర్మించే ప్రాథమిక పునాదిగా ఉంటుంది’ అని ఉన్న కోట్‌ను షేర్ చేస్తూ మనస్తత్వాన్ని నియంత్రించుకోండి, ఫలితాన్ని నియంత్రించండి అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story