- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rakul: ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు అలాంటి అవకాశం కోసం ఎదురుచూపులా?
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నా, సరైన అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ క్రేజ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె ఆ తర్వాత కూడా వరుసగా విజయాలను అందుకొని అత్యంత తక్కువ కాలంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేని స్థాయిలో ముందుకు సాగింది. అలాంటి సమయంలోనే రకుల్ తెలుగు ఇండస్ట్రీపై కాకుండా తమిళ, హిందీ సినిమాలపై ఆసక్తి చూపించడం ప్రారంభించింది. దాంతో తెలుగులో సినిమాలు పూర్తిగా ఆపేసి ఇతర భాష చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది.
ఈ నటి ఆఖరుగా తెలుగులో ‘కొండపొలం’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు, అలాగే ఓకే కూడా చెప్పలేదు. ప్రస్తుతం ఈ స్టార్ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తెలుగు సినిమాలతో భారీగా గ్యాప్ రావడంతో ఈమెకు టాలీవుడ్ చిత్రాల నుంచి పెద్దగా అవకాశాలు రావడం లేదని సమాచారం. స్టార్ హీరోల సినిమాల్లో ఈమెకు అవకాశాలు దక్కకపోవడం, అలాగే మిడ్ రేంజ్ హీరోలు కూడా రకుల్‌పై దృష్టి పెట్టకపోవడంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నం సులభం కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువగా హిందీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






