రాకాస టీజర్ విడుదల తేదీ ఫిక్స్

by Pulgam srinivas |

సంగీత్ శోభన్ హీరోగా రూపొందిన రాకాస చిత్ర టీజర్‌ను మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

రాకాస టీజర్ విడుదల తేదీ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్ : మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సంగీత్ శోభన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తక్కువ సినిమాల్లో నటించినా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు రాకాస అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుండగా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదల ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తుంది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్ల స్పీడును పెంచారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది. మార్చి 1వ తేదీన ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ టీజర్ గనుక ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే ప్రేక్షకుల్లో ఈ హర్రర్ ఫాంటసీ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

కొన్ని రోజుల క్రితం నిహారిక ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ... ఇదొక వినూత్నమైన ఫాంటసీ కామెడీ డ్రామా అని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. గతంలో నిహారిక, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ను కూడా నిర్మించింది. దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. మరి వీరి కాంబోలో రూపొందుతున్న రాకాస చిత్రం జనాల్ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.




Next Story