రాజ్య మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది.. హైప్ పెంచుతున్న రౌడీ హీరో వైల్డ్ పోస్టర్

by I. Sairam |

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కింగ్డమ్'(Kingdom).

రాజ్య మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది.. హైప్ పెంచుతున్న రౌడీ హీరో వైల్డ్ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanoori) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కింగ్డమ్'(Kingdom). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా మే 30న విడుదల కానుంది . ఇక దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌, ఫస్ట్ సింగిల్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో మరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ‘కింగ్డమ్ నెలకు స్వాగతం.. మీకు చిరస్మరణీయమైన ఉత్సాహాన్ని అందించడానికి లాక్ చేయబడిన మరియు లోడ్ చేయబడిన అనుభవాల వర్షం.. మరిన్ని నవీకరణలు త్వరలో ప్రారంభమవుతాయి’ అని ఉంది. అలాగే విజయ్ దేవరకొండ వైల్డ్ పోస్టర్ పై ‘రాజ్య మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Next Story