- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బహిరంగ క్షమాపణ కోరిన "రాజు వెడ్స్ రాంబాయి" టీమ్
ప్రముఖ డైరెక్టర్ వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవ నిర్మాతగా, సాయిలు కంపాటి దర్శకత్వంలో వస్తున్న ఫిల్మ్ "రాజు వెడ్స్ రాంబాయి".

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ డైరెక్టర్ వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవ నిర్మాతగా, సాయిలు కంపాటి దర్శకత్వంలో వస్తున్న ఫిల్మ్ "రాజు వెడ్స్ రాంబాయి". గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని "రాంబాయి నీ మీద నాకు మనసాయెనే.." అనే సాంగ్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అయితే ప్రస్తుతం.. అభిమానులకు రాజు వెడ్స్ రాంబాయి టీమ్ బహిరంగ క్షమాపణలు చెప్పడం సంచలనం రేపింది.
"మా టీమ్ అంతా ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెబుతోంది కానీ ఈ క్షమాపణ తప్పు చేసిందుకు మాత్రం కాదని తెలిపింది. ఇటీవల మేము విడుదల చేసిన 'రాంబాయి నీమీద..' అనే సాంగ్ మిమ్మల్ని నిరంతరం మిమల్ని చుట్టేస్తున్నందుకు, నిరంతరం మీ చేత ఆ పాట మాత్రమే హమ్ చేసేలా చేసినందుకు, ఆ పాటకు మీరు డ్యాన్స్ చేసేలా ఊపేస్తున్నందుకు, మీరు అదే పాట మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తున్నందుకు, మిగతా పాటలన్నీ సడన్ గా బోర్ కొట్టేలా మార్చినందుకు క్షమాపణలు" అంటూ వెరైటీ ప్రచారానికి తెరలేపింది చిత్ర యూనిట్.
ప్రస్తుతం ఆ పాట ట్రెండింగ్ 2 లో ఉండటంతో.. ఆ విజయాన్ని పురస్కరించుకొని టీమ్ ఇలాంటి విచిత్ర లేఖను రిలీజ్ చేసింది. అయితే మొదట ఏమైందో అని కంగారు పడిన వారంతా.. పూర్తి లెటర్ చదివిన తర్వాత.. చిత్ర బృందాన్ని విష్ చేయకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలోకి రానుంది.






