- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజు గారి పెళ్లిరో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట
స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో సంక్రాంతికి అలరించబోతున్నాడు. ప్రమోషన్స్‌లో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘భీమవరం బాల్మా’ ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం

దిశ, సినిమా : స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో సంక్రాంతికి అలరించబోతున్నాడు. ప్రమోషన్స్‌లో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘భీమవరం బాల్మా’ ఆకట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్ ‘రాజు గారి పెళ్లిరో’ విడుదలైంది. డ్యాన్స్ నంబర్‌గా విడుదలైన ఈ పాట మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెప్పించింది. పండగ వాతావరణాన్ని ముందే తీసుకొచ్చింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే పెళ్లి పాటలలో ఒకటిగా నిలవనుంది. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఎక్స్‌ట్రార్డినరీ ఎనర్జీతో పాటను మరో స్థాయికి తీసుకొని వెళ్లారు. రావు రమేష్ సహా ప్రధాన నటీనటులంతా పాల్గొనడంతో దృశ్య పరంగా ఈ పాట మరింత రిచ్‌గా మారింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా..శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న సినిమా జనవరి 14న విడుదల కాబోతుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.






