కేరళలో రజినీకాంత్.. రీజన్ తెలిసి ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-04-12 14:15:54  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

కేరళలో రజినీకాంత్.. రీజన్ తెలిసి ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇందులో జైలర్-2(Jailer-2) ఒకటి. రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ‘జైలర్’ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. వరుస ప్లాపులతో సతమతమవుతున్న సూపర్ స్టార్‌కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది ఈ మూవీ. 2023లో వచ్చి ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గానే ‘జైలర్ 2’ రాబోతున్న విషయం తెలిసిందే. దీనిని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇక సంక్రాతి కానుకగా జైలర్-2 నుంచి వచ్చిన టీజర్‌ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పుడెప్పుడు ఈ మూవీ నుంచి అప్‌డేట్ వస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరొక అప్‌డేట్ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ కోసం కేరళ(Kerala)కి వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ అట్టప్పడి అనే అందమైన ప్రాంతంలో 35 రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని సమాచారం. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story