‘కన్నప్ప’ సినిమా చూసిన రజినీకాంత్.. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని ట్వీట్

by Sujitha Rachapalli |

మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇంతకు ముందు సినిమాపై మీమ్స్ వచ్చినా.. ట్రైలర్ వచ్చాక మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ పెరిగింది. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉండటం,

‘కన్నప్ప’ సినిమా చూసిన రజినీకాంత్.. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని ట్వీట్
X

దిశ, ఫీచర్స్ : మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇంతకు ముందు సినిమాపై మీమ్స్ వచ్చినా.. ట్రైలర్ వచ్చాక మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ పెరిగింది. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉండటం, మూవీ గ్రాండ్‌గా కనిపించడం ప్లస్ అవుతున్నట్లే కనిపిస్తుంది. మొత్తానికి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాపై హైప్ మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నాడు విష్ణు. ఈ క్రమంలోనే సీనియర్ హీరో రజినీకాంత్‌ను కూడా ఇందులో భాగం చేశాడు. తాజాగా ఆయనకు కన్నప్ప చిత్రాన్ని చూపించామని.. ఆయనకు బాగా నచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశాడు.

సినిమా చూశాక రజినీకాంత్ అంకుల్ టైట్ హగ్ ఇచ్చాడని.. తనకు కన్నప్ప నచ్చిందని చెప్పాడని తెలిపాడు మంచు విష్ణు. ఈ క్షణం కోసం 22 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని తెలిపాడు. గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పిన హీరో.. జూన్ 27 కోసం వెయిట్ చేయలేకపోతున్నానని.. వెండి తెరపై శివుడి మ్యాజిక్ ఫీల్ అయ్యేందుకు ఈగర్‌గా ఉందని చెప్పాడు. ఇక ఈ ట్వీట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కానీ కొందరు మాత్రం రజినీకాంత్‌ను విష్ణు అంకుల్ అని పిలవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషనల్ డ్యామేజ్‌గా వర్ణిస్తున్నారు.

TWEET

Next Story