పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించకండి : రజనీకాంత్

by Bhanu |

సౌత్ ఇండియన్ సినిమా దిగ్గజం, సూపర్ స్టార్ రజనీకాంత్ వయస్సును మరిచిపోయే శైలితో, ఇంకా ఎన్నో యువ నటులకు సైతం పోటీగా నిలుస్తూ సినీ లోకాన్ని ఆకట్టుకుంటున్నారు.

పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించకండి : రజనీకాంత్
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఇండియన్ సినిమా దిగ్గజం, సూపర్ స్టార్ రజనీకాంత్ వయస్సును మరిచిపోయే శైలితో, ఇంకా ఎన్నో యువ నటులకు సైతం పోటీగా నిలుస్తూ సినీ లోకాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కూలీ" అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగనున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదల కానుంది.

నటుడిగా మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా, మన దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షకుడిగా రజనీకాంత్ విస్తృతంగా గుర్తింపు పొందారు. తాజాగా తన భార్య లత రజనీకాంత్ నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ, నేటి యువతలో సంస్కృతిపై ఆసక్తి తక్కువైపోతోందని, అది ఓ ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు.

‘‘నేటి యువత, కొంతమంది పెద్దలు సైతం మొబైల్ ఫోన్ల ప్రభావంతో పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. వారు మన దేశ సంప్రదాయాలను, విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారు. భారతదేశం ఎంత గొప్పదో, మన ఆధ్యాత్మికత ఎంత ప్రాచీనమో తెలియకుండానే అంధంగా విదేశీయుల జీవితశైలిని అనుకరిస్తున్నారు. కానీ వారే ఇప్పుడు మన ధ్యానం, యోగా వంటి అంశాలలో ఆనందం, శాంతిని వెతుకుతున్నారు. ఇది మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనం. నా భార్య లత భారత సంప్రదాయాల గురించి అవగాహన పెంచే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ ప్రయత్నం దేవుడి దయతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను,’’ అని రజనీకాంత్ వివరించారు. రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని, మనం తమెరు లేకుండా మన మూలాలను గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.



Next Story