Rajinikanth : రజినీ ఫ్యాన్స్‌కు షాక్.. జైలర్ 2 తర్వాత తలైవా రిటైర్‌మెంట్..?

by Bhanu |

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.

Rajinikanth : రజినీ ఫ్యాన్స్‌కు షాక్.. జైలర్ 2 తర్వాత తలైవా రిటైర్‌మెంట్..?
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారనే ఊహాగానాలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి. కానీ, ఈ విషయంపై తలైవా కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌ను ఇదే ప్రశ్న అడగ్గా, ఆమె చాలా తెలివిగా సమాధానమిచ్చారు. "నాకు ఆ సమాధానం తెలిస్తే తప్పకుండా మీతో చెబుతాను," అంటూ అభిమానులను, మీడియాను ఆయన భవిష్యత్తు గురించి సస్పెన్స్‌లో ఉంచారు.

వయసు 74 ఏళ్లు పైబడినప్పటికీ, రజనీకాంత్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ' షూటింగ్‌ను పూర్తి చేశారు. వెంటనే నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జైలర్ 2' షూటింగ్‌లో బిజీ అయిపోయారు. 'జైలర్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన 'జైలర్' సినిమాలో ఇతర భాషల సూపర్ స్టార్లు అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇటీవల కేరళలో జరిగింది. అక్కడ రజనీకాంత్ తన 'వెట్టైయన్' సహనటుడు ఫహద్ ఫాజిల్‌ను మళ్లీ కలిసి స్వాగతం పలికారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర రావు, శృతి హాసన్ వంటి భారీ తారాగణం ఉండటమే కాకుండా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అయితే.. అన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ, రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటన చేయలేదు. పైగా, కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తూ తన అభిమానులను ఉత్కంఠతతో మంచెత్తుతున్నారు. మొత్తానికి, సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ ప్రయాణం ఇప్పుడప్పుడే ఆగేలా లేదు..!


Next Story