- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌తో రజనీ నెక్స్ట్
తమిళ స్టార్ హీరో రజనీకాంత్ 70ఏళ్లు దాటినా క్రేజీ సినిమాలతో అభిమానులను పలకరిస్తున్నారు. చివరగా రజనీ 2024లో వెట్టైయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో రజనీకాంత్ 70ఏళ్లు దాటినా క్రేజీ సినిమాలతో అభిమానులను పలకరిస్తున్నారు. చివరగా రజనీ 2024లో వెట్టైయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. దీనికంటే ముందు రజనీ జైలర్ సినిమాతో వచ్చాడు. దీనికంటే ముందు వరుస ఫ్లాప్ లు వెంటాడగా జైలర్ రజనీ అభిమానుల ఆకలి తీర్చింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు రజనీకాంత్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే సిబి చక్రవర్తి దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక ఇప్పుడు తలైవా తరవాత సినిమాపై కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రజనీ తరవాత సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వెల్పారీ అనే శంకర్ డ్రీమ్ ప్రాజెక్టులో రజనీ నటించబోతున్నాడట. అంతే కాకుండా ఈ సినిమాకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ మీడియా నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.






