- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆది సాయి కుమార్, కె-ర్యాంప్ డైరెక్టర్ కాంబినేషన్‌లో సినిమా?
హీరో ఆది సాయికుమార్ నటించిన "శంబాల" మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆది సాయికుమార్ ను కలిసి శుభాకాంక్షలు

దిశ, సినిమా : హీరో ఆది సాయికుమార్ నటించిన "శంబాల" మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆది సాయి కుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్య మూవీస్ బ్యానర్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలో ప్రొడ్యూసర్ రాజేష్ దండా వెల్లడించనున్నారు.
బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో హాస్య మూవీస్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ దీపావళికి కిరణ్ అబ్బవరం హీరోగా "కె ర్యాంప్" మూవీని నిర్మించి ఘన విజయాన్ని దక్కించుకుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంస్థలో నిర్మాణవుతున్నాయి. ఇలాంటి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ నే ఆది సాయికుమార్ తో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించబోతున్నారు.






