- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రాజేంద్ర ప్రసాద్ నోటిదూల.. రవితేజ సినిమాపై కామెంట్స్.. అదే జరిగితే ఇండస్ట్రీని వదిలేస్తానని సవాల్
రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మరో స్టార్ హీరో సూర్యను పిలిచి మూవీపై మరింత హైప్ పెంచారు. ఈ కార్యక్రమంలో సూర్య,

దిశ, వెబ్ డెస్క్ : రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మరో స్టార్ హీరో సూర్యను పిలిచి మూవీపై మరింత హైప్ పెంచారు. ఈ కార్యక్రమంలో సూర్య, రవితేజపై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు.. ఈ చిత్రంలోని డైలాగ్ చెప్పి సినీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేశాడు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని, అవ్వాలని కోరుకున్నాడు.
ఇక ఇందులో కీరోల్ ప్లే చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోటిదూలతో వార్తల్లో నిలిచాడు. హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియా డిబేట్స్ జరిగేంత కంటెంట్ ఇచ్చాడు. ‘‘మాస్ జాతర’ మూవీ చూసి షాక్ కాకపోతే ఇండస్ట్రీని వదిలేస్తా’ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఈ టాపిక్ కాస్త ట్రోలింగ్‌కు దారి తీసింది. ‘ఉండొచ్చు కానీ మరీ ఇంత నోటి దూల ఉండకూడదు.. సినిమా మీద నమ్మకం ఉన్నా ఇలాంటి స్టేట్మెంట్స్ అవసరమా’ అంటూ పొట్టు పొట్టు వేసుకుంటున్నారు నెటిజన్లు.






