- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో "రాజాసాబ్"నో ప్రీమియర్స్.. చిత్రయూనిట్ కీలక నిర్ణయం
టికెట్ ధరలపై, ప్రీమియర్స్ పై ప్రభుత్వం నుండి జీవో రాకనపోవడంతో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. దీంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ పడతాయని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూశారు. ఇప్పటికే ఏపీలో షోలు కూడా వేశారు. కానీ తెలంగాణలో మాత్రం షోలు వేయలేదు. సాయంత్రం నుండి జీవో వస్తుందని అభిమానులు, చిత్రయూనిట్ వేచి చూసినా జీవో విడుదలవ్వలేదు. టికెట్ ధరలపై, ప్రీమియర్స్ పై ప్రభుత్వం నుండి జీవో రాకనపోవడంతో చిత్రయూనిట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒక ప్రీమియర్ షో మాత్రమే వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాత్రి 10గంటలకు బాలనగర్ లోని విమల్ థియేటర్‌లో ఈ షో వేయాలని నిర్ణయించాట. అంతే కాకుండా ఈ షోకి కేవలం మీడియా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. ప్రీమియర్స్ లేకపోవడంతో రేపు ఉదయం థియేటర్లలో రాజాసాబ్ సందడి చేయనుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.






