- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Junior: అన్నీ ఎమోషన్స్‌తో అద్భుతంగా ఆకట్టుకుంటోన్న ట్రైరల్..
యంగ్ హీరో కిరీటి (తొలి పరిచయం), యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జూనియర్’.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరీటి (తొలి పరిచయం), యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జూనియర్’. యూత్ అండ్ హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. జులై 18న రిలీజ్ కానుండటంతో టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా వచ్చిన ‘వైరల్ వయ్యారి’ సాంగ్ చార్ట్‌బస్టర్ హిట్ అందుకోగా.. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘అభిని తల్లిదండ్రులు చాలా గారభంగా చూసుకుంటారు.
తండ్రి అభిని ఎంతో ప్రేమతో చూస్తాడు. కాలేజ్‌కి వచ్చిన తర్వాత క్లాస్‌మేట్ స్పూర్తిని ప్రేమించేస్తాడు. అప్పటి వరకు అభి జీవితం హ్యాపీగా, ఎలాంటి బాధ్యతలు లేకుండా సాగుతుంది. కానీ, తన తండ్రి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న తర్వాత జీవితం పూర్తిగా మారి అక్కడ నుంచి వేరేలే టర్న అవుతోంది. మొత్తంగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్‌తో పాటు మంచి ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఫాదర్-సన్ ఎమోషనల్ ట్రాక్, జెనీలియా పాత్ర, ఊరి బ్యాక్‌డ్రాప్ ఇవన్నీ కలిపి ఈ సినిమాను ఒక మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి నచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. Link






