- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాజా సాబ్’ రిలీజ్ అండ్ టీజర్ డేట్ ఫిక్స్.. ఏంటి భయ్యా ఆ పోస్టర్.. బాక్సులు బద్దలవ్వాల్సిందేనా..
డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). ఇక ఈ మూవీలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్(Sanjay dutt) కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్విరామంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవికి సంబంధించిన ఓ క్రేజ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘తిరుగుబాటు వైబ్‌తో రాజా వచ్చేస్తున్నాడు.. TheRaja Saab థియేటర్లలో అత్యంత వినోదాత్మక ఆనందోత్సాహాల కర్టెన్ రైజర్ షోను కవర్ చేయడానికి సిద్ధంగా ఉంది.. డిసెంబర్ 5 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో రిలీజ్ కానుంది.. కానీ అంతకు ముందు జూన్ 16న ఉదయం 10:52 గంటలకు టీజర్ పేలుడు వస్తోంది’ అని రాసుకొస్తూ టీజర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే ప్రభాస్ గ్రే కలర్ ప్యాంట్ అండ్ బ్లాక్ కలర్ స్లీవ్ బనీన్ వేసుకుని రెడ్ కలర్ పెద్ద వస్త్రాన్ని పట్టుకున్నాడు. అయితే ఈ క్లాత్ అంచున నిప్పు అంటుకొని ఉంది. అలాగే వెనుక ఓ మహల్‌లో మొత్తం మంటలు అంటుకోగా రూ.500 నోట్లు కొన్ని కాలిపోతుండగా కొన్ని గాల్లో ఎగురుతున్నాయి. ఫైనల్‌గా పోస్టర్‌తోనే సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. ఇక ఈ పోస్టర్‌ను చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సారి బాక్సులు బద్దలవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






