రాజా సాబ్ కోసం ప్రభాస్ బిగ్ ప్లాన్..ఆ మెగా హీరో బాటలోనే ?

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas) అభిమానులకు ఊహించని షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన తాజా సినిమా ది

రాజా సాబ్ కోసం ప్రభాస్ బిగ్ ప్లాన్..ఆ మెగా హీరో బాటలోనే ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas) అభిమానులకు ఊహించని షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన తాజా సినిమా ది రాజా సాబ్ ( The Raja Saab ) మరింత ఆలస్యంగా రిలీజ్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ మారుతి ( Maruthi ), హీరో ప్రభాస్ కాంబినేషన్ లో ఈ ది రాజా సాబ్ సినిమా వస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ మెరువనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమా... డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

2023 సంవత్సరంలో యానిమల్ సినిమా ( Animal ) డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయింది. ఆ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. బంపర్ హిట్ అందుకుంది. త్వరలోనే పార్టు 2 కూడా రాబోతుంది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కూడా గత సంవత్సరం 2024 డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయింది. దీంతో అల్లు అర్జున్ నటించిన ఈ పుష్ప 2 ( Pushpa 2) కూడా బంపర్ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా... కోట్లలో కలెక్షన్స్ తీసుకువచ్చింది. అయితే ఈ రెండు సినిమాల బాటలో ప్రభాస్ కూడా నడిచేందుకు సిద్ధమవుతున్నారట. ది రాజా సాబ్ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఈ మేరకు ప్రభాస్ అలాగే చిత్ర బృందం మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10వ తేదీన అంటే మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ వెనక్కి వెళ్ళింది. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ పై ఇంకా ప్రకటన రాలేదు. ఎప్పుడు ప్రకటన వస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఈ కొత్త రూమర్ బయటకు వచ్చింది. ఇదే నిజమైతే డిసెంబర్ మొదటి వారంలో ప్రభాస్ సినిమా థియేటర్ లో చూడవచ్చు.

Next Story