రైజింగ్ స్టార్‌.. మీరా రాజ్

by Sujitha Rachapalli |

చూడ‌చ‌క్క‌ని రూపం.. గుండె కోసే వలపు సోయగం.. స్క్రీనంతా తళుక్కుమంటూ చెలరేగిపోయే చ‌లాకీద‌నం.. ఇవ‌న్నీటికి రూపం.. హీరోయిన్ మీరా రాజ్. నార్త్ నుంచి వచ్చిన ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రైజింగ్ స్టార్‌.. మీరా రాజ్
X

దిశ, సినిమా : చూడ‌చ‌క్క‌ని రూపం.. గుండె కోసే వలపు సోయగం.. స్క్రీనంతా తళుక్కుమంటూ చెలరేగిపోయే చ‌లాకీద‌నం.. ఇవ‌న్నీటికి రూపం.. హీరోయిన్ మీరా రాజ్. నార్త్ నుంచి వచ్చిన ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గ్లామ‌ర్ ఆండ్ యాక్టింగ్ ఫ‌ర్మార్మెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న మీరా రాజ్.. పాత్రలో లీనమయ్యే విధానం, భాష పట్ల చూపించే నిబద్ధత, కష్టపడే మనస్తత్వం.. ఆమెను స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలబెడుతున్నాయి. మీరా రాజ్ లేటెస్ట్‌ తెలుగు మూవీ 'స‌న్ ఆఫ్' (Son Of ) ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు భారీ రెస్పాన్ వ‌స్తోంది. ఈ మూవీలో మీరా త‌న పాత్రకు.. స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమా త‌ర్వాత మీరా రాజ్ కెరీర్ స్పీడ్‌గా దూసుకుపోతుంది. తాజాగా ఆమె ‘కాంచన 4’లో చోటు దక్కించుకుంది. ఈ చిత్రంలో తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోంది. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా.. సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనం.

Next Story