- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ గురించి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సంచలన ట్వీట్.. వైరల్ అవుతున్న పోస్ట్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ నటీనటులు, సినిమాలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరినీ సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం

దిశ, ఫీచర్స్ : తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ నటీనటులు, సినిమాలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరినీ సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరుకాగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా హైదరాబాద్ గల్లీ నుంచి వచ్చి ఆస్కార్ అవార్డు అందుకున్న తెలంగాణ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్‌ను సత్కరించాలని స్వయంగా సీఎం ప్రభుత్వాన్ని కోరడం ప్రత్యేకమే. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
ఇక దీనిపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపాడు. గల్లీలో పెరిగిన ఒక ఆర్టిస్టును గుర్తించి, గౌరవిస్తున్న సీఎం నిజంగా గొప్ప వ్యక్తి అని.. అంత ప్రెస్టీజియస్ స్టేజీ మీద తన గురించి మాట్లాడటంతో ఎమోషనల్ అయిపోయాయని ట్వీట్ చేశాడు. ఇది మరిచిపోలేని జ్ఞాపకమన్న సింగర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెస్పాన్స్ మరింత సంతోషాన్నిచ్చిందని రాసుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. కొందరు కంగ్రాట్స్ చెప్తుంటే ఇంకొందరు మాత్రం నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు.






