- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మికతో రాహుల్ రవీంద్రన్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో నటిగా మరో మెట్టు ఎక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాహుల్ రవీంద్రన్

దిశ, సినిమా : పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో నటిగా మరో మెట్టు ఎక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ ప్యూర్ లవ్ అందించారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నామని.. ఇకపై తమ ఒపీనియన్ చెప్పడంలో వెనుకడుగు వేయబోమని వీడియోలు, ట్వీట్లు పెట్టారు. కాగా ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న రాహుల్, రష్మిక మరోసారి తమ కాంబినేషన్‌తో రాబోతున్నారు. ఇప్పటికే రాహుల్.. స్క్రిప్ట్ నరేట్ చేయగా.. రష్మిక ఇందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పాడు. కచ్చితంగా హిట్ కొడుతామనే ధీమాతో ఉన్నట్లు చెప్పాడు. అయితే నిర్మాతను ఫైనల్ చేసుకోవాల్సి ఉందని.. ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని తెలిపాడు. ఇక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయల్‌కు మంచి గుర్తింపు లభించింది.






