ధనుష్ సినిమా రీరిలీజ్.. పూర్తిగా డిజప్పాయింట్ అయిన హీరో.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..

by Sujitha Rachapalli |

ధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ‘రాంజానా’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 12ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మళ్లీ రీరిలీజ్ అయింది. నార్మల్‌గా మూవీ రీరిల్ అంటే టీమ్ సూపర్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ చిత్ర బృందం మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ అయింది

ధనుష్ సినిమా రీరిలీజ్.. పూర్తిగా డిజప్పాయింట్ అయిన హీరో.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..
X

దిశ, వెబ్ డెస్క్: ధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ‘రాంజానా’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 12ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మళ్లీ రీరిలీజ్ అయింది. నార్మల్‌గా మూవీ రీరిల్ అంటే టీమ్ సూపర్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ చిత్ర బృందం మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ అయింది. కారణం ఏఐ సహాయంతో క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేయడమే. ఇంతకు ముందే మూవీ డైరెక్టర్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా ధనుష్ కూడా డిజప్పాయింట్ అయినట్లు నోట్ రిలీజ్ చేశాడు.

రంజానా సినిమా ఏఐతో మార్చిన క్లైమాక్స్‌తో రీరిలీజ్ చేయడం పూర్తిగా కలతకు గురి చేసిందన్నాడు. దీనివల్ల మూవీ సోల్ పూర్తిగా పోయిందని.. పన్నెండేళ్ల క్రితం నేను నమ్ముకున్న సినిమా ఇది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏఐతో మూవీని, కంటెంట్‌ను మార్చడం కళను, కళాకారులను అవమానించడమేనని.. ఇదే కంటిన్యూ అయితే చాలా ముప్పు జరుగుతుందని హెచ్చరించాడు. ఇలాంటి పద్ధతులు ఉండబోకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని.. ఇందుకు తగిన విధంగా నిబంధనలు రావాలని కోరాడు.

LINK

Next Story