- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఫిక్స్ .. ఎన్ని కోట్లంటే!
మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ థియేటర్లలో సందడీ చేస్తుంది

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ( Allu Arjun) నటించిన "పుష్ప 2" ( Pushpa 2)మూవీ నేడు దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ థియేటర్లలో సందడీ చేస్తుంది. కొన్ని ఏరియాల్లో డిసెంబర్ 4 రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. కొన్ని చోట్ల గురువారం (డిసెంబర్ 5) తెల్లవారుజామున 4 గంటల నుంచి ‘పుష్ప 2 ది రూల్’ షోలు మొదలయ్యాయి.
బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. మూవీ లవర్స్ అందరూ పుష్ప 2 మూవీని చూడటానికి వెళ్తున్నారు. పుష్ప 2 మూవీ ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం, రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప–2 మూవీ తప్ప వేరేది వినిపించడం లేదు.
ఏ థియేటర్ కి వెళ్ళినా ఒకటే సౌండ్ .. జాతర ఇది ఊర మాస్ జాతర అంటూ చెబుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వారి అభిమాన హీరోని 3 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూసి ఎమోషనల్ అవుతున్నారు. తాజాగా, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ వార్త హల్చల్ చేస్తుంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. భారీ ధరకు అమ్ముడుపోయిందని సినీ వర్గాల వారు చెబుతున్నారు. దాదాపు రూ. 250 కోట్ల తో మూవీని దక్కించుకున్నట్టు తెలుస్తోంది.






