- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌పై కుట్ర జరుగుతున్న మాట వాస్తవమే.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
థియేటర్ల థియేటర్ల మూసివేత అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: థియేటర్ల థియేటర్ల మూసివేత అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకునేందుకే ఓ నలుగురు నిర్మాతలు కుట్ర చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు ఆజ్యం పోసేలా.. ఓ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమే పవన్ కల్యాణ్‌పై పెద్ద కుట్ర జరుగుతోందని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. 'హరిహర వీరమల్లు' సినిమాను కొందరు టార్గెట్ చేశారని అన్నారు. ఓ న్యూస్ ఛానల్ డిబేట్‌లో నట్టి కుమార్( Natty Kumar) మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సినిమాను దెబ్బ తీయాలని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ కలిసి కుట్ర చేశారని అన్నారు. ఇన్నాళ్లు లేనిది.. ఇప్పటికిప్పుడు థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. ఈ కుట్రలో వైసీపీ హస్తం ఉందని చెప్పారు. గతంలో భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలోనూ ఇదే తరహా కుట్ర జరిగిందని గుర్తుచేశారు. మరోవైపు సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు.






