పతంగ్‌ అందరి హృదయాలను దోచుకుంటుంది.. నిర్మాతలు

by Sujitha Rachapalli |

ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'పతంగ్‌' ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘ప‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్

పతంగ్‌ అందరి హృదయాలను దోచుకుంటుంది.. నిర్మాతలు
X

దిశ, సినిమా : ప్రతిష్టాత్మక సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్‌’. ప‌తంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్‌ కామెడీ స్పోర్ట్స్ డ్రామాను సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కుడు. ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి ప‌గ‌డాల‌, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్నారు.

పాపులర్‌ దర్శకుడు, నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్, న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీ పూజిత్.. ‘ఈ చిత్రం ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ మంచి రెస్పాన్స్‌ ఇచ్చారు. ట్రైలర్‌లో వున్న పాజిటివ్‌ వైబ్‌ సినిమాలో కూడా ఉంటుంది. పతంగ్‌ పోటీల సీజీ కూడా వరల్డ్‌క్లాస్‌ లెవల్‌లో ఉంటుంది. యూత్‌ఫుల్‌గా కలర్‌ఫుల్‌గా మా సినిమా అందర్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది' అన్నారు. ప్రీతి పగడాల మాట్లాడుతూ.. ‘పతంగ్‌లో నేను నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ట్రైలర్‌ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. ట్రైలర్‌ మ్యాజిక్‌ చేసింది. ట్రైలర్‌ నచ్చిన అందరికి సినిమా కూడా నచ్చుతుంది’ అన్నారు. ఇక ఈ సినిమా తనతో పాటు మా అందరికి చాలా టఫ్‌ అండ్‌ ఎమోషనల్‌ జర్నీ అని తెలిపిన ప్రణవ్ కౌశిక్.. విమర్శకుల ప్రశంసలు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశాడు.

Next Story