హారర్ థ్రిల్లర్స్‌లో సరికొత్త ‘ఈషా’

by Sujitha Rachapalli |

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను

హారర్ థ్రిల్లర్స్‌లో సరికొత్త ‘ఈషా’
X

దిశ, సినిమా : ‘ఈషా’ సినిమా హారర్ థ్రిల్లర్స్‌లో సరికొత్తగా ఉంటుందన్నారు నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి. డిసెంబర్ 25న రిలీజ్ కాబోతున్న చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న వారు.. మూవీ అందరి అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అఖిల్‌ రాజ్‌, త్రిగుణ్‌, హెబ్బా పటేల్‌, సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ప్రధానపాత్రల్లో నటించగా.. ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం కంటెంట్ నమ్మి రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. మొదటి పది నిమిషాల్లోనే సినిమా ఎందుకు తీసుకున్నామో అందరికీ అర్థమవుతుందని.. ఆద్యంతం ఆసక్తిగా, భయంగా ఉంటుందని.. చివరి పదిహేను నిమిషాలు చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఒక మంచి విషయం చెప్పారని ప్రేక్షకులు ఫీల్ అవుతారని.. ఆడియన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తప్పకుండా రీచ్‌ అవుతుందని.. తమ నమ్మకాన్ని నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు తాము డిస్ట్రిబ్యూటర్స్‌ చేసే పని కన్నా ఎక్కువ వర్క్‌ చేస్తున్నామని.. ఎడిట్‌ రూమ్‌ దగ్గరి నుంచి మేము అనుకున్న మార్పులు చేసి.. సినిమాను ఓ ప్లానింగ్‌ ప్రకారం విడుదల చేస్తున్నామన్నారు. ఆర్‌ఆర్‌తో పాటు మ్యూజిక్‌లో కూడా ఇన్‌వాల్వ్‌ అవుతామని.. సినిమాను మార్కెటింగ్‌ చేసి.. నాన్‌ థియేట్రికల్‌ను కూడా క్లోజ్‌ చేసి.. చిత్రాలను విడుదల చేయడంలో మాదొక కొత్త ట్రెండ్‌.. ఫిల్మ్‌ను ఓ స్ట్రాటజీ ప్రకారం విడుదల చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Next Story