ఛాంపియన్ ను వేరొకరు తీసి ఉంటే.. ఇలాంటి రివ్యూలు ఇచ్చేవారు కాదు : స్వప్న దత్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-26 21:16:36  IST  )

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా.. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ..

ఛాంపియన్ ను వేరొకరు తీసి ఉంటే.. ఇలాంటి రివ్యూలు ఇచ్చేవారు కాదు : స్వప్న దత్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా.. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన సినిమా ఛాంపియన్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదలైంది. పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా శుక్రవారం సక్సెస్ మీట్ జరుపుకోగా.. నిర్మాత స్వప్న దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సినిమాను మరొకరు తీసి ఉంటే.. క్రిటిక్స్ ఇలాంటి రివ్యూలే ఇచ్చేవారు కాదన్నారు. తమకుతేలికగా తెరకెక్కించే సినిమాలు నచ్చవని, కష్టమైన సినిమాలను నిర్మించడంలోనే తృప్తి ఉందన్నారు.

సినిమా రన్ టైమ్ తగ్గించేందుకు ఇష్టపడలేదు ఎందుకు అని ఒక విలేఖరి ప్రశ్నించగా.. ఏదైనా చెప్పడం చాలా సులువు అని, చేయడం కష్టమన్నారు. సినిమాలో ఏదిపడితే అది ఎడిట్ చేసుకుంటూ వెళ్తే.. సినిమా ఉండదని, అందులో కొన్ని సీన్లు మాత్రమే ఉంటాయని అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ సినిమా ఏంటని మరొకరు అడగ్గా.. తాము నిర్మించబోయే తదుపరి సినిమా కల్కి 2 అని జవాబిచ్చారు స్వప్న దత్. ఇక తొలిరోజు ఛాంపియన్ సినిమా రూ.4.50 కోట్లు వసూలు చేసింది.

Next Story