- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్‌తో దిల్ రాజు మరో సినిమా.. సారీ చెబుతూ క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మెగా అభిమానులకు నిర్మాత శిరీష్(Producer Sirish) మరోసారి సారీ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా అభిమానులకు నిర్మాత శిరీష్(Producer Sirish) మరోసారి సారీ చెప్పారు. తమ్ముడు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గేమ్ ఛేంజర్ సినిమాపై శిరీష్ చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్(Ram Charan) అభిమానులకు కోపం తెప్పించాయి. దీంతో శిరీష్‌కు వార్నింగ్ ఇస్తూ చరణ్ ఫ్యాన్స్ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే ఆ లేఖపై స్పందించి క్షమాపణ చెప్పిన శిరీష్.. తాజాగా మరోసారి ఈ అంశంపై మాట్లాడారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘మెగా హీరోలతో మా SVC సంస్థకు మంచి రిలేషన్ ఉంది. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంటర్వ్యూలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మెగా ఫ్యాన్స్ బాధపడ్డారని తెలిసింది. అందుకే మరోసారి సారీ చెబుతున్నా. మా బ్యానర్‌లో రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నారు. అభిమానుల బాధను నేను అర్థం చేసుకోగలను. అయితే, నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు. మా మధ్య ఉన్న స్నేహంతో మాట దొర్లా. మెగా ఫ్యామిలీ హీరోలను తాము చాలా అభిమానిస్తాం.. అలాంటి అనుబంధం ఉన్న వారిని అవమానించేంత మూర్ఖుడిని కాదు. అభిమానులు అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని విడుదల చేయొద్దు అని ఆయన చెప్పి ఉంటే.. ఆ మూవీ రిలీజ్ అయ్యేదే కాదు. మంచి మనసు ఉన్న వ్యక్తి కాబట్టి.. మా గురించి ఆలోచించారు. అలాంటిది ఆయన్ను ఎందుకు అవమానిస్తాం? ఆయనతో ఇంకో సినిమా చేయబోతున్నాం’ అని నిర్మాత శిరీష్ ప్రకటించారు.






