ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు: నిర్మాత రాజ్ కందుకూరి

by Ajay Maddhiboyina |

సినీ కార్మికుల ఆందోళనలపై నిర్మాత రాజ్ కందుకూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ కార్మికులు జీతాలు పెంచాలని ఆందోళన చేయడం విచారకరం అన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు: నిర్మాత రాజ్ కందుకూరి
X

దిశ‌, వెబ్ డెస్క్: సినీ కార్మికుల ఆందోళనలపై నిర్మాత రాజ్ కందుకూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ కార్మికులు జీతాలు పెంచాలని ఆందోళన చేయడం విచారకరం అన్నారు. ఫైనాన్షియల్ గా చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. ఏడాదికి 200 సినిమాల వరకు రిలీజ్ అయితే అందులో 20, 30 సినిమాలు కూడా హిట్ అవ్వడం లేదని అన్నారు. ప్రతి నిర్మాత ఏదో ఒక రకంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రొడక్షన్ వ్యయం పెరిగిందని, రెమ్యునరేషన్లు పెరిగాయని అన్నారు.

అన్ని ధరలు పెరిగాయని కానీ ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. నిర్మాతల సంఘం ఏం చెబితే అదే ఫైనల్ అని దానికి తాము కట్టుబడి ఉండాలన్నారు. సినీ పరిశ్రమ కష్టాలకు ఏదైనా పరిష్కారం దొరికితే అందరికీ మంచి జరుగుతుందన్నారు. కార్మికుల కష్టాలను అర్థం చేసుకుంటామని, వాళ్లు కూడా పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలన్నారు. షూటింగ్ ఆగిపోవడం పరిశ్రమకు అంత మంచిది కాదన్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నీ తొలగిపోయి మళ్లీ మంచి రోజులు రావాలని కోరుకున్నారు.

Next Story