Daku Maharaj: బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘డాకు మహారాజ్‌’ సక్సెస్‌ ఈవెంట్‌‌పై అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ...

by Chukka Sudharani |   (  Updated:2025-07-28 16:46:05  IST  )

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj).

Daku Maharaj: బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘డాకు మహారాజ్‌’ సక్సెస్‌ ఈవెంట్‌‌పై అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ...
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. దీంతో.. ప్రజెంట్ డాకు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం వరుసగా మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఇందులో భాగంగా ‘డాకు మహారాజ్‌’ సక్సెస్ ఈవెంట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ. ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్‌ (Pre release) ఈవెంట్‌ రద్దు అయిన అనంతపురంలోనే సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. త్వరలోనే వేడుక ఉంటుందన్నారు.

ఆదివారం విడుదలైన ఆ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో ఆయన ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌లో నాగవంశీతోపాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్‌ (Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్‌ (Shraddha Srinath), ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు. కాగా.. ‘డాకు మహారాజ్’ చిత్రం రిలీజ్‌కు ముందు పీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. కానీ, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన టీమ్‌ తమ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను రద్దు చేసుకుంది. అందుకే తమ సక్సెస్ ఈవెంట్‌ను మాత్రం అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు నిర్మాత నాగవంశీ.

Click For Video..

Next Story