- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్‌పై మనసుపడిన నిర్మాత.. మరీ ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పి.. వీడియోలు వైరల్
సితార ఎంటర్‌టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ మొహమాటం లేకుండా మాట్లాడేస్తాడు. 2025 ఫస్ట్ హాఫ్‌లో వరుస విజయాలు అందుకున్న ఆయన.. సెకండ్ హాఫ్‌లో మాత్రం కాస్త స్లో అయ్యాడు. కానీ సంక్రాంతి తర్వాత మాత్రం మళ్లీ మునపటి వంశీని చూస్తారని అంటున్నాడు

దిశ, సినిమా : సితార ఎంటర్‌టైన్మెంట్స్, నిర్మాత నాగ వంశీ మొహమాటం లేకుండా మాట్లాడేస్తాడు. 2025 ఫస్ట్ హాఫ్‌లో వరుస విజయాలు అందుకున్న ఆయన.. సెకండ్ హాఫ్‌లో మాత్రం కాస్త స్లో అయ్యాడు. కానీ సంక్రాంతి తర్వాత మాత్రం మళ్లీ మునపటి వంశీని చూస్తారని అంటున్నాడు. రవితేజ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో 99.99% హిట్ కొడుతున్నామని ధీమా వ్యక్తం చేశాడు. ఆ తర్వాత రాబోతున్న ‘అనగనగా ఒక రాజు’తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతామని... త్రివిక్రమ్ ఈ సినిమా క్వాలిటీని సర్టిఫై చేశాడని.. మూవీపై చాలా కేర్ తీసుకున్నాడని తెలిపాడు. మరోవైపు ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల కన్నా పెద్ద బడ్జెట్‌తో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ల ముందు తనను తాను బాగా ప్రెజెంట్ చేసుకునేందుకు యంగ్ ఉమెన్‌తో పికిల్ బాల్ గేమ్ ఆడుతున్నానని.. ప్రెజెంట్ తన క్రష్ మృణాల్ ఠాకూర్ అని చెప్పుకొచ్చాడు.






