OG: ఇది నాకు ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్ర.. హీరోయిన్ ప్రియాంక మోహన్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

‘నాని గ్యాంగ్‌లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక మోహన్..

OG: ఇది నాకు ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్ర.. హీరోయిన్ ప్రియాంక మోహన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ‘నాని గ్యాంగ్‌లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక మోహన్.. తర్వాత శ్రీకారం, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించింది. ఇప్పుడు త్వరలో పనవ్ కల్యాణ్ ‘ఓజీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘OG సినిమాలో కణ్మని పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. పవన్ కల్యాణ్‌తో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కల్యాణ్ జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్‌లో అండ్ ఆఫ్ స్క్రీన్‌లో ఆయన రియల్ హీరో’ అంటూ తెలిపింది.

Next Story