- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నేను ఒత్తిడి లేకుండా అన్నింటినీ గ్రహించగలిగాను’.. డిఫరెంట్ లుక్‌లో దర్శనమిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Mohan)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఓంద్ కథే హెల్లా అనే కన్నడ సినిమాతో మొదటిసారిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు గిరీష్ జి దర్శకత్వం వహించారు. తర్వాత విక్రమ్ కుమార్ రూపొందించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కీలక పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన శివకార్తికేయన్, డాక్టర్ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వంద కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.
ప్రియాంక అరుల్ మోహన్ మొదటిసారిగా ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. తాజాగా ప్రియాంక టర్కికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తను అక్కడ ఎంజాయ్ చేసిన ఫొటోలు, వీడియోలు పంచుకుంది. ‘‘నా టర్కిష్ కలలను నిజం చేసింది. అద్భుతమైన తీరప్రాంతాల నుంచి దాచిన రత్నాల వరకు, టర్కీలో అన్ని ఉన్నాయి. ప్రతి నగరం, ప్రతి మలుపు దాని స్వంత మాయాజాలం కలిగి ఉంది. నేను ఒత్తిడి లేకుండా అన్నింటినీ గ్రహించగలిగాను’’. అంటూ పోస్ట్‌లో క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ప్రియాంక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






