Priyanka Arul Mohan: గత రెండు ఏళ్లుగా దానికి నేను బానిసయ్యాను.. షాకింగ్‌గా హీరోయిన్ ప్రియాంక పోస్ట్

by Chukka Sudharani |   (  Updated:2025-08-28 09:12:08  IST  )

పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న మూవీ ‘ఓజీ’.

Priyanka Arul Mohan: గత రెండు ఏళ్లుగా దానికి నేను బానిసయ్యాను.. షాకింగ్‌గా హీరోయిన్ ప్రియాంక పోస్ట్
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న మూవీ ‘ఓజీ’. పవర్ స్టార్ పవర్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుష్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. ఫస్ట్ సింగిల్‌తో మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా వచ్చిన సెకండ్ సింగిల్ కూడా నెట్టింట మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ‘సువ్వి సువ్వి’ అంటూ సాగే ఈ లవ్ మెలోడీ సాంగ్ రిలీజై సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.

దీంతో తాజాగా ప్రియాంక అరుళ్ మోహన్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘గత రెండు సంవత్సరాలుగా నేను ఈ పాటకు బానిసయ్యాను.. ఇప్పుడు ఫైనల్‌గా విడులై మీ ముందుకు వచ్చింది. మీరందరూ నాలాగే దీన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అంటూ తెలిపింది. కాగా.. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది.

Next Story