- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ప్రియదర్శి హీరోగా ఓ కొత్త దర్శకుడితో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరైన సుకుమార్ చాలా కాలం క్రితమే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ బ్యానర్‌లో పలు సినిమాలు తెరకెక్కి మంచి గుర్తింపును సంపాదించాయి. తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఓ కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
అలాగే, మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోగా కెరీర్ ప్రారంభించిన తొలి దశలో ప్రియదర్శి మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగాడు. అయితే, ఈ మధ్యకాలంలో మాత్రం ఆయనకు వరుసగా ప్లాప్స్ ఎదురవుతున్నాయి. ఈ వారం ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘సుయోధన’ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన దక్కడం లేదని తెలుస్తోంది.






