- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prithviraj Sukumaran: పుష్ప ఇంటర్నేషనల్.. మనం లోకల్.. అదరగొడుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ టీజర్
గోట్, సలార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విలాయత్ బుధ’.

దిశ, సినిమా: గోట్, సలార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విలాయత్ బుధ’. మలయాళ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీ తెలుగుతో పాటు ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈక్రమంలోనే తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘వాడే మెయిన్ ఏజెంట్.. ఈ చందనం బిజినెస్ అంతా వాడి ద్వారానే జరుగుతుంది. ఓ చిన్న సైజు వీరప్పన్’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ను తలపిస్తుంది.
అలాగే ‘నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావురా.. నువ్వు ఏమైనా పుష్ప అనుకుంటున్నావా’ అని పోలీస్ ప్రశ్నించగా.. పృథ్వీరాజ్ ‘అయ్యో కాదు.. తను ఇంటర్నేషనల్.. మనం లోకల్’ అంటూ చెప్తాడు. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇది మరో పుష్ప సినిమా అయ్యేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. విలాయత్ బుద్ధ అనే మలయాళ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఓ స్కూల్ టీచర్ తన ఇంటి ఆవరణలో రహస్యంగా అరుదైన గంధపు చెట్లను పెంచుతుంటాడు. ఓ స్మగ్లర్ కన్ను స్కూల్ టీచర్ పెంచుతున్న గంధపు చెట్లపై పడగా.. ఇద్దరి మధ్య ఘర్షణ కాస్తా ఊరితో పాటు మాఫియా కనెక్ట్ అయే క్రమంలో ఎలాంటి పరిణాలు జరుగుతాయి అనేది స్టోరీ. అయితే.. ఇది నవల ఆధారంగా రూపొందబోతున్నప్పటికీ కొన్ని సీన్స్ పుష్ప సినిమాను గుర్తుచేస్తుండటం విశేషం.






