- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prithviraj Sukumaran: పొరపాటున కూడా ప్రభాస్‌కు అలాంటి మాటలు చెప్పకండి.. తర్వాత జరిగేది అదే
ప్రభాస్ చాలా ఉదారంగా ఉండే వ్యక్తి. ఎవరికైనా ఏదైనా నచ్చిందని తెలిసితే, వెంటనే దాన్ని వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తారని పృథ్వీరాజ్ సరదాగా చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి ఇండియావ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. కొంతకాలం క్రితం ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. తాజాగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ… “ప్రభాస్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఆయన ముందు నాకు ఇది నచ్చిందని అన్నారే అనుకోండి, ఆయన కొన్ని గంటల్లోనే అది ఎంత విలువైనదైనా సరే దానిని మీకు ఏర్పాటు చేసి ఇస్తారు. అందుకే ఆయనతో ఏదైనా ఇష్టం ఉన్నా సైలెంట్‌గా ఉండటం బెటర్” అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇలా ఈ నటుడు ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. అది పూర్తి కాగానే సలార్ పార్ట్-2ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






