- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డుపై కొట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్ తండ్రి, ఆర్టిస్ట్ మేనేజర్
ఇటీవల విడుదలైన ప్రేమిస్తున్నా సినిమా హీరోయిన్ తండ్రి, ఆ సినిమా ఆర్టిస్ట్ మేనేజర్ రోడ్డుపై కొట్టుకున్నారు. ప్రేమిస్తున్నా సినిమాలో సాత్విక్ వర్మ హీరోగా నటించగా, ప్రీతి నేహా హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ తండ్రి, సినిమా ఆర్టిస్ట్ మేనేజర్ మధ్య గొడవ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల విడుదలైన ప్రేమిస్తున్నా సినిమా హీరోయిన్ తండ్రి, ఆ సినిమా ఆర్టిస్ట్ మేనేజర్ రోడ్డుపై కొట్టుకున్నారు. ప్రేమిస్తున్నా సినిమాలో సాత్విక్ వర్మ హీరోగా నటించగా, ప్రీతి నేహా హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా విషయంలో హీరోయిన్ తండ్రి, సినిమా ఆర్టిస్ట్ మేనేజర్ మధ్య గొడవ జరిగింది. తన కుమార్తె వల్లనే సినిమా బాగా ఆడుతోందని హీరోయిన్ తండ్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పగా, ఆర్టిస్ట్ మేనేజర్ నగరి చలపతి సినిమా అసలు ఆడటం లేదని తొలిరోజే డిజాస్టర్ టాక్ వచ్చిందని అన్నారు.
ఈ సినిమాకు తానే అందరు ఆర్టిస్ట్ లను సెట్ చేశానని చెప్పారు. సినిమా ఆడకపోవడంతో తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ సైతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీరి ప్రెస్ మీట్లు వివాదానికి దారి తీశాయి. ఈ క్రమంలో శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద చలపతిపై హీరోయిన్ తండ్రి దాడి చేశాడు. భూతులు తిడుతూ వెంటపడి కర్రతో దాడి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






