Preity Zinta: ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ప్రకటించిన ప్రీతి జింటా.. ధైర్యవంతులైన రక్షకులకు అండగా నిలుద్దామంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-25 08:34:18  IST  )

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

Preity Zinta: ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ప్రకటించిన ప్రీతి జింటా.. ధైర్యవంతులైన రక్షకులకు అండగా నిలుద్దామంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అలాగే ఆమె తెలుగు స్టార్స్ మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్(Venkatesh) వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా ఐపీఎల్‌లోనూ హుషారుగా పాల్గొంటుంది. పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా కూడా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ప్రీతిజింటా పలు విషయాలపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తోంది. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రీతిజింటా ఇండియన్ ఆర్మీకి భారీ విరాళం ప్రకటించింది. కమాండ్‌లోని ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రీతి జింటా రూ. 1.10 కోట్ల విరాళం ఇచ్చింది.

జైపూర్‌లో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్, ప్రాంతీచ అధ్యక్షుడు శప్తా శక్తి ఆర్మీ కుటుంబాలు హాజరైన సందర్భంగా ఈ విరాళం అందచేయడం జరిగింది. ఇక ఈ విసయంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘మన సాయుధ దళాల ధైర్యవంతులైన కుటుంబాలకు సహాయం అందించడం గౌరవం బాధ్యత. మన సైనికులు చేసిన త్యాగాలను ఎప్పటికీ నిజంగా తిరిగి చెల్లించలేము. అయితే, మనం వారి కుటుంబాలకు అండగా నిలిచి ముందుకు సాగడంలో వారికి మద్దతు ఇవ్వగలం. భారత సాయుధ దళాల పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. మన దేశం కోసం పోరాడే ధైర్యవంతులైన రక్షకులకు అచంచలమైన మద్దతుగా నిలుస్తాము’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతుండటంతో.. అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story