- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపించే ప్రకాష్ రాజ్, నిజ జీవితంలో మాత్రం ఆయన వ్యవహారం మరోలాగా ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉంటారు. కమ్యూనిస్టు వాదంతో ముందుకు నడుస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్.
రామ లక్ష్మణులపై హాట్ కామెంట్స్
నిత్యం బీజేపీపై విమర్శలు చేసే ప్రకాష్ రాజ్, తాజాగా రామ లక్ష్మణులపై హాట్ కామెంట్స్ చేశారు. రాముడు, లక్ష్మణుడు ఉత్తరభారతం నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారని షాకింగ్ విషయాలను పంచుకున్నారు.
అయితే ఆ పొలం యజమాని గిరిజనుడు అయిన రావణుడు అంటూ వ్యాఖ్యానించారు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దది అయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. GST తో కలిపి 2000 డాలర్లు కట్టాలని శూర్పణఖ చెప్పింది అంటూ ఓ ప్రైవేట్ ఈవెంట్ లో వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్. అయితే రామ లక్ష్మణులను వలస కూలీలు అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.






